రెండుపూటలా తిండిలేక.. పస్తులుండాల్సిన పరిస్థితి

by  |
CPI leaders
X

దిశ, చేవెళ్ల: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పెట్రోల్, డీజీల్, వంటగ్యాస్ ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపిందన్నారు. పెట్రోల్ డీజీల్ ప్రభావంతో నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్నంటడంతో నిరుపేదలు రెండుపూటలా కడుపునిండా అన్నం తినలేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.

పెట్రోల్ ధరలు దాదాపు లీటర్ వందకు చేరువలో ఉండడం దారుణమన్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు నెలకురూ.7500 బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి జంగయ్య, సహాయ కార్యదర్శి రఘురాం, నాయకులు రుక్కయ్య, రాములు, శ్రీశైలం, అశోక్, మధు కుమార్, మారుతీ, జయరామ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed