ప్రాజెక్టులు తరలిపోతుంటే పట్టించుకోరా?

by  |
ప్రాజెక్టులు తరలిపోతుంటే పట్టించుకోరా?
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల కంపెనీలు రావడం లేదని ఆరోపించారు. గత రెండేళ్లలో ఏపీలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఎన్ని అంటూ నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ తిరోగమన విధానాల వల్ల ఏపీలో కొత్తగా పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోగా, ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికే లులూ గ్రూప్, రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ట్రైటాన్ వంటి సంస్థల పెట్టుబడులు తరలిపోయినట్లు తెలుస్తోంది.

పారిశ్రామిక పురోగతి లేకుండా రాష్ట్ర ప్రగతి ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి ఏపీ నుండి రాజ్యసభ సభ్యునిగా గెలిపించిన పారిశ్రామికవేత్త పరిమల్ నత్వాని ద్వారా ఏపీకి ఎంత పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని కె.రామకృష్ణ ప్రశ్నించారు.


Next Story

Most Viewed