రోగుల భోజనంలో జెర్రీలు.. యాక్షన్ తీసుకోవాలని సీపీఐ డిమాండ్

by  |
రోగుల భోజనంలో జెర్రీలు.. యాక్షన్ తీసుకోవాలని సీపీఐ డిమాండ్
X

దిశ, గోదావరిఖని: గోదావరిఖనిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సంబంధించిన కాంట్రాక్టర్ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, కలుషితమైన భోజనాన్ని పెడుతున్నారని సీపీఐ నాయకులు కె. కనక‌రాజ్, మద్దెల దినేష్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో రోగులకు వడ్డించే భోజనంలో జెర్రీలు రావడం ఏంటని నిలదీశారు. ఇది కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. భోజనాలకు సంబంధించిన అసలు కాంట్రాక్టర్ ఎక్కడో హైదరాబాదులో ఉంటూ.. ఇక్కడ ఓ బినామీ కాంట్రాక్టర్‌ను పెట్టుకున్నారన్నారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని మేమేం చేసిన నడుస్తుందనే అహంకారంతో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని సీపీఐ నేతలు ఆరోపించారు. మెనూలో ఉన్న ఆహర పదార్థాలను అందించకుండా.. ఇష్టం వచ్చిన వంటలు(నాసిరకంగా) వండి రోగులకు అందించడం దారుణమన్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బినామీ కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీసులు కాకుండా.. నేరుగా కాంట్రాక్ట్‌నే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌తో పాటు గోదావరిఖని సూపరింటెండెంట్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు.

Next Story

Most Viewed