ఓఎల్ఎక్స్ మోసాలపై షార్ట్ ఫిల్మ్

by  |
ఓఎల్ఎక్స్ మోసాలపై షార్ట్ ఫిల్మ్
X

దిశ, క్రైమ్ బ్యూరో: ఫేస్‌బుక్, వాట్సాప్, ఓఎల్ఎక్స్ ఆన్‌లైన్ వేదికలను సైబర్ నేరగాళ్లు అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చుకుంటున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. ఓఎల్ఎక్స్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రముఖ యాంకర్ వర్షిణి, విద్యార్థిని సింధు సంగం నటించిన షార్ట్ ఫిల్మ్‌ను సీపీ సజ్జనార్ శనివారం విడుదల చేశారు. అనంతరం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ఓఎల్ఎక్స్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్మీ అధికారులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రచారం చేసుకుంటూ విలువైన కార్లు, కెమెరాలు, ఇతర సెకండ్ హ్యాండ్ వస్తువుల క్రయ, విక్రయాలు పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. వస్తువు డెలివరీ కాకుండా, నగదు చెల్లించవద్దని, క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించాలని ఎదుటి వ్యక్తులు చెప్పగానే దానిని మోసంగా గ్రహించాలన్నారు. ఆన్‌లైన్ వేదికగా ఏ రకమైన మోసానికి గురైనా డయల్ 100 ద్వారా లేదా సైబరాబాద్ పోలీసులు నెంబర్ 94906 17444‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. షార్ట్‌ఫిల్మ్‌లో నటించిన యాంకర్ వర్షిణి, సింధు, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ హైమను సీపీ సజ్జనార్ అభినందించారు.



Next Story

Most Viewed