8 దేశాల్లో కొవిషీల్డ్‌కు అనుమతి

by  |
8 దేశాల్లో కొవిషీల్డ్‌కు అనుమతి
X

న్యూఢిల్లీ: ఈయూ గ్రీన్‌పాస్ వివాదంలో భారత వ్యూహం సక్సెస్ అయింది. గ్రీన్ పాస్‌ల విషయంలో కొవిషీల్డ్‌కు యూరోపియన్ సభ్యదేశాలు లైన్ క్లియర్ చేశాయి. కొవిషీల్డ్‌ను తమ అప్రూవ్డ్ వ్యాక్సిన్ జాబితాలో చేర్చనున్నట్టు ప్రకటించాయి. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలైన ఆస్ట్రియా, జర్మనీ, గ్రీస్,ఐర్‌ల్యాండ్, స్లోవేనియా, స్పెయిన్, ఐస్‌ల్యాండ్, స్విట్జర్‌ల్యాండ్ దేశాలు కొవిషీల్డ్ ను అంగీకరించాయి.

కాగా భారత వ్యాక్సిన్స్ కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లను గ్రీన్ పాస్‌పోర్టు కోసం యూరప్ దేశాలు పరిగణించకపోవడంతో వివాదం మొదలైంది. దీంతో కొవిషీల్డ్ టీకా సర్టిఫికేట్‌ను గ్రీన్ పాస్ కోసం పరిగణనలోకి తీసుకోవాలని, లేదంటే తాము కూడా ఈయూ గ్రీన్ పాస్‌పోర్టులను లేదా వారి టీకా సర్టిఫికేట్‌లనూ అంగీకరించబోమని భారత్ తెలిపింది. టీకా వేసుకున్న యూరోపియన్ పౌరులు ఇండియాలోకి వస్తే తప్పనిసరిగా నిర్ణీత సమయం వరకు క్వారంటైన్‌లో ఉంచుతామని భారత్ హెచ్చరించింది. దీంతో ఈయూ దేశాలు తాజాగా కొవిషీల్డ్ పై ప్రకటన చేశాయి.


Next Story

Most Viewed