కొవిడ్ నిబంధనల ఉల్లంఘన.. దేశాధ్యక్షుడికి ఫైన్

by  |
కొవిడ్ నిబంధనల ఉల్లంఘన.. దేశాధ్యక్షుడికి ఫైన్
X

సావ్‌పావొలో: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఏకంగా దేశాధ్యక్షుడికే ఫైన్ పడింది. చట్టం ఎవరికీ చుట్టం కాదనీ, అందరికీ వర్తిస్తుందని పేర్కొంటూ అధికారులు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో‌కు జరిమానా విధించారు. ఎలాంటి శానిటరీ నిబంధనలు, మాస్కులు ధరించకుండా అధ్యక్షుడు బోల్సోనారో మారన్‌హావ్ రాష్ట్రంలో శుక్రవారం ఓ కార్యక్రమాన్ని నిర్వహించారని, ఇది రాష్ట్ర చట్టాలకు విరుద్ధమని రాష్ట్ర గవర్నర్ ఫ్లేవియో డినో తెలిపారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమానికైనా 100 మందికి మించి అనుమతి లేదని, అందులోనూ మాస్క్ ధరించడం మ్యాండేటరీ అని ఆయన గుర్తుచేశారు.

దేశాధ్యక్షుడైనా, చట్టాలు అందరికీ వర్తిస్తాయని పేర్కొటూ ఈ లెఫ్టిస్ట్ లీడర్ జైర్ బాల్సోనారోకు ఫైన్ వేశారు. బోల్సోనారో 15 రోజుల్లో అప్పీల్ చేయాలి. లేదంటే జరిమానా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు బ్రెజిల్‌లోనే నమోదైనా, ఆ దేశాధ్యక్షుడు కొవిడ్ కట్టడి చర్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్ నిబంధనలను పలుసార్లు తృణీకరించారు. లెఫ్టిస్ట్ గవర్నర్ డినో ఓ చిన్నపాటి నియంత అని, స్థానికంగా ఆంక్షలు విధిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆయన విమర్శించడం గమనార్హం.

Next Story

Most Viewed