పర్యాటకానికి పెరుగుతున్న డిమాండ్!

by  |
పర్యాటకానికి పెరుగుతున్న డిమాండ్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత పర్యాటక, ప్రయాణ రంగం కరోనా కారణంగా దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల దేశీయంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగవంతంగా జరుగుతుండటంతో ఈ రంగం పుంజుకుంటుందనే ఆశలు పెరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దేశంలోని పర్యాటకుల్లో విశ్వాసం పెరిగిందని, ప్రజలు దేశీయ, విదేశీ పర్యటనకు డిమాండ్ వృద్ధి సాధిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2020 వేసవి కాలతో పోలిస్తే ఈసారి వేసవికి ప్రయాణ, హోటళ్లలో బుకింగ్ పెరిగాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

ఈ పరిణామాలు పరిశ్రమ పుంజుకునేందుకు దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇదివరకటి గణాంకాల ప్రకారం ఏడాదికి 2.5 కోట్ల నుంచి 3 కోట్ల మంది మన దేశ పర్యాటకులు విదేశాలకు ప్రయాణిస్తుంటారు. గతేడాది కరోనా వల్ల వీరందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల వ్యాక్సిన్ సరఫరా మొదలవడంతో పర్యాటకుల్లో మునుపటి నమ్మకం, విశ్వామ పెరగడం గమనించామని మైక్ మై ట్రిప్ ప్రతినిధి విపుల్ ప్రకాశ్ చెప్పారు. గతేడాది కరోనాతో దెబ్బతిన్న తర్వాత ఈ వేసవికి పర్యాటక రంగం డిమాండ్‌ను సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఏప్రిల్-జూన్ మధ్య విదేశాలతో పాటు దేశీయంగా ఉన్న రిసార్ట్, బీచ్ ప్రాంతాలకు బుకింగ్‌లు పెరిగాయి. గతేడాదితో పోలిస్తే బుకింగ్స్ 70 శాతం పెరగడం పరిశ్రమ కోలుకోవడానికి సాక్ష్యమని తెలిపారు. ఆసక్తికరంగా ఎక్కువమంది విదేశాల కంటే దేశీయంగా ప్రయాణాలకే మొగ్గు చూపారని మారియట్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నీరజ్ చెప్పారు. దీనివల్ల దేశీయ పర్యాటక, ప్రయాణ రంగంలో మునుపటి ఉత్సాహం కనిపిస్తుందని ఆయన వెల్లడించారు.



Next Story

Most Viewed