బెల్లంపల్లిలో దంపతుల ఆత్మహత్య..

6

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పోచమ్మ చెరువులో దూకి భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకివెళితే.. మల్లేష్, నర్మద దంపతులు బెల్లంపల్లిలో నివాసముంటున్నారు. గత కొంతకాలంలో ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు. ట్రీట్ మెంట్ కోసం డబ్బులు కూడా సరిపోవడం లేదు

ఈ నేపథ్యంలోనే దంపతులిద్దరూ పోచమ్మ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తమకు చావుకు ఎవరూ కారణం కాదని.. అనారోగ్య సమస్యల వల్లే ఆత్మహత్యకు పూనుకున్నట్లు సూసైడ్ నోట్ రాశారు. అయితే, నర్మద ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్‌లో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తోంది. మల్లేష్ ఓ న్యూస్ ఛానల్లో రిపోర్ట‌ర్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.