‘‘కరోనా’’ ప్రపంచ రికార్డు..

by  |
‘‘కరోనా’’ ప్రపంచ రికార్డు..
X

ఇప్పటివరకూ మనుషులపైనే పంజా విసిరిన కరోనా వైరస్‌. ఇప్పుడు జంతువులను కూడా టార్గెట్‌ చేస్తోంది. హాంకాంగ్‌‌లో ఓ పెంపుడు కుక్కకు కరోనావైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. మనిషి నుంచి జంతువుకు సోకిన తొలి కేసుగా ఇది ప్రపంచ రికార్డులోకి ఎక్కింది. ఈ కుక్కను 60ఏళ్ల మహిళ పెంచుకుంటోంది. ఆమె నుంచే కుక్కకు కరోనా సోకింది. దీంతో దాన్ని జంతువుల క్వారంటైన్‌‌కు పంపించారు. గత శుక్రవారం నుంచి దానికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనావైరస్‌ ఉందని రిపోర్ట్‌ వస్తోంది. గత శుక్రవారం హాంకాంగ్‌ ప్రభుత్వం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక క్వారంటైన్‌‌ను ఏర్పాటు చేసింది. వైరస్‌ బారినపడిన జంతువులను 14రోజుల పాటు అక్కడ ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ మరో రెండు కరోనా వైరస్‌ సోకిందని అనుమానిస్తున్న కుక్కలను ఐసొలేషన్‌‌లో ఉంచారు. ఈ రెండు కుక్కలలో ఒక దానికి కరోనా నెగెటివ్‌ అని తేలింది. దానికి మరోసారి పరీక్ష నిర్వహించి, మళ్లీ నెగెటివ్‌ అని తేలితే ఐసొలేషన్‌ నుంచి విడుదల చేయనున్నారు. మరోకుక్క గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

tags : coronavirus, World record, hong kong, dog, 60 year old woman


Next Story

Most Viewed