కరోనా ఎఫెక్ట్.. భక్తులకు టీటీడీ ఆంక్షలు

by  |

అమరావతి: కరోనా పాజిటివ్ కేసులు భారత్‌లోనూ రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో ఏపీలోని ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వెళ్లే దారిలో ఇప్పటికే మూడు స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిన టీటీడీ.. ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారిని వెంటనే ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించేందుకు చర్యలు చేపట్టింది.
ఇదిలా ఉండగా, కడపలోని ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాన్ని టీటీడీ ప్రతిఏటా పెద్దఎత్తున నిర్వహిస్తూ వస్తోంది. అయితే, ఈసారి మాత్రం పరిమితంగా నిర్వహించాలని యోచిస్తోంది. వచ్చే నెల 4నుంచి ప్రారంభమవనున్న ఈ ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహిస్తే, లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. జనాలు గుమిగూడే ప్రదేశాల్లో కరోనావ్యాప్తి పెరిగే అవకాశాలు అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు. సీఎం జగన్ హాజరై.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్టు వెల్లడించారు.

Tags: TTD, srirama navami, vontimitta, carona, scare, EO Anil kumar singhal, covid-19, ap,

Next Story

Most Viewed