కమల్‌నాథ్ సర్కారును కాపాడిన కరోనా!

by  |
కమల్‌నాథ్ సర్కారును కాపాడిన కరోనా!
X

భోపాల్ : దేశమంతా కరోనాతో బెంబేలెత్తిపోతుంటే.. మధ్యప్రదేశ్ సర్కారుకు మాత్రం ఊరట లభించినట్టు తెలుస్తున్నది. 22 మంది ఎమ్మెల్యేలు రెబెల్ కావడంతో కాంగ్రెస్ సర్కారు సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ 22 మంది రాజీనామాలనూ పంపించి.. కాంగ్రెస్ సర్కారుకు మద్దతును విరమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం విశ్వాసపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. కాంగ్రెస్ సర్కారు కరోనానే నమ్ముకున్నట్టు తెలుస్తున్నది. బీజేపీ ఎమ్మెల్యేలు ఫ్లోర్ టెస్ట్‌కు డిమాండ్ చేస్తుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం మాస్క్‌లు ధరించి అసెంబ్లీకి వచ్చారు. కరోనావైరస్ కల్లోలం రేపుతున్నది కాబట్టి సమావేశాలు వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరారు. బడ్జెట్ సమావేశాలను పదిరోజులపాటు నిరవధిక వాయిదావేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఫ్లోర్ టెస్ట్‌ను కాంగ్రెస్ సర్కారు వాయిదా వేసుకున్నది. అందుకే, కరోనావైరస్ కమల్‌నాథ్ సర్కారుకు తాత్కాలికంగా ఉపశమనమిచ్చిందని రాజకీయ విశ్లేషకులు ఛమత్కరిస్తున్నారు.



Next Story

Most Viewed