కరోనా రికవరీలు పెరుగుతున్నాయి..

by  |
కరోనా రికవరీలు పెరుగుతున్నాయి..
X

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నట్టే రికవరీల సంఖ్య కూడా ఆశాజనకంగా కనిపిస్తున్నది. శుక్రవారం ఉదయం కేంద్రం ప్రకటించిన గణాంకాల ప్రకారం.. 24 గంటల్లోనే రికార్డు రికవరీల సంఖ్య నమోదైంది. రోజు వ్యవధిలో 1,007 కేసులు కొత్తగా నమోదవ్వగా.. 260 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు రోజు వ్యవధిలో రికవరీల సంఖ్య ఇదే గరిష్టం. అంతేకాదు, మరో మంచి విషయమేమంటే.. రికవరీల రేటు స్థిరంగా పెరుగుతూ వస్తున్నది. ఉదాహరణకు గతనాలుగు రోజులుగా రికవరీల రేటు గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా కేసులు 13,387కి పెరిగింది. 24 గంటల్లోనే 437 కేసులు కొత్తగా వెలుగుచూశాయి. కాగా, మొత్తం రికవరీల సంఖ్య 1,749కి పెరిగింది. కేసులు, రికవరీలను పోలుస్తూ రికవరీల రేటు చూస్తే.. శుక్రవారం ఉదయం ఇది 13.06గా నమోదైంది. మంగళవారం ఈ రేటు 9.99గా, బుధవారం 11.41గా, గురువారం 12.02గా ఉన్నది. తాజాగా, 13.06గా రికవరీ రేటు నమోదైంది.

Tags: coronavirus, recoveries, fatalities, health ministry, india, 24 hours, rate, cases

Next Story

Most Viewed