ఈ పది జిల్లాల్లో కరోనా లేదు

by  |
ఈ పది జిల్లాల్లో కరోనా లేదు
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో మొత్తం నెల రోజుల వ్యవధిలో 229 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ నగరంలో 105 నమోదుకాగా దీనికి అనుకుని ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో చెరి 15 కేసుల చొప్పున నమోదయ్యాయి. మొత్తం 23 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా పది జిల్లాల్లో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ పది జిల్లాల్లో కరోనా అనుమానితుల సంఖ్య కూడా లేదు. మొత్తానికి ఈ జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా తొలుత 75 జిల్లాల్లోనే కరోనా అనుమానితులు, పాజిటివ్ పేషెంట్లు ఉండగా ఇప్పుడు అది 211 జిల్లాలకు పాకింది. తెలంగాణలో సైతం ఒకటి రెండు జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ కేసులు ఇప్పుడు 23 జిల్లాలకు పాకింది.

కరోనా తాకిడి లేని ఆ పది జిల్లాలు ఇవే.

కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, ములుగు, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఉపశమనం.

Tags: Telangana, Corona Positive, cases, NIL, Twelve Districts



Next Story

Most Viewed