ఎలా చనిపోయినా కరోనా యేనా? ఎందుకలా?

by  |
ఎలా చనిపోయినా కరోనా యేనా? ఎందుకలా?
X

ఈ మధ్య ఎవరు ఏవిధంగా ఏ కారణంతో చనిపోయినా దాన్ని కరోనాకు ముడేస్తున్నారు. చదువుకోని వాళ్లే కాదు, చదువుకున్న డాక్టర్లు కూడా చనిపోయిన శవాలకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. అయితే ఇలా
చేయడం సబబు కాదని అందరూ అనుకుంటున్నారు. అయితే అలా పరీక్షలో చేయడానికి వైద్యపరంగా పెద్ద కారణం ఉంది. కరోనా వైరస్ శరీరంలో ఒక్కోభాగాన్ని ఒక్కో రకంగా ప్రభావితం చేస్తుంది. కేవలం
దగ్గు, జలుబు జ్వరం మాత్రమే కాకుండా కాలేయం, హృదయం, ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేస్తుది. దీంతో కొంతమందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే మరణం సంభవించవచ్చు.
అందుకే ప్రతి మరణాన్ని కరోనాతో సరిపోల్చి, వారికి కాంటాక్టు అయిన వ్యక్తులను క్వారంటైన్ చేయడానికే వైద్యులు ఇలా శవాలకు కూడా పరీక్షలు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ ఏయే శరీరభాగాన్ని ఎలా
ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

1. మెదడు – కరోనా వైరస్‌ మెదడు మీద ప్రభావం చూపించడం వల్ల శరీర సమతాస్థితిని పరిరక్షించే మెడుల్లా ఆబ్లాంగేటా దెబ్బతింటుంది. దీంతో శరీర ఉష్ణోగ్రత పెరిగి, జ్వరం వస్తుంది.

2. ముక్కు – దీనివల్ల ముందు వాసన చూసే జ్ఞానం కోల్పోతారు. కరోనాలో కనిపించే మొదటి లక్షణం ఇదే అని డాక్టర్లు చెబుతున్నారు.

3. ఊపిరితిత్తులు – వీటిలోని వాయుగోణులు ప్రభావితం కావడం వల్ల దగ్గు, శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి.

4. గుండె, ఛాతీ భాగం – హృదయ స్పందన రేటులో మార్పులు వస్తాయి. ఊపిరి పీల్చేటపుడు ఛాతీ నొప్పి వస్తుంది.

5. మూత్రపిండాలు – కొంతమందిలో మాత్రమే కరోనా వైరస్ మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల సరిగా మూత్రం రాదు. అంతేకాకుండా కిడ్నీ కణజాలం కొద్దికొద్దిగా క్షీణిస్తుంది.

6. ప్రేగులు – పొత్తికడుపులో నొప్పి, వాంతులు, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది ఇవి ముందుగా కనిపించి ప్రాణాలకు హాని కలిగిస్తాయి.

7. కండరాలు, కీళ్లు – వైరల్ ఇన్‌ఫ్లమేషన్ కారణంగా నొప్పులు వస్తాయి.

8. కాలివేళ్లు, చర్మం – కొంతమందిలో కాలివేళ్ల చర్మం రంగు మారుతుంది. అవి గులాబీ రంగులోకి మారతాయి. ఇది కూడా కరోనాలో కచ్చితంగా కల్పించే లక్షణం.

ఇలా ఒక్కో భాగాన్ని ఒక్కో రకంగా ప్రభావితం చేస్తున్న కారణంగా ఎవరైనా చనిపోతే సరైన కారణం తెలుసుకోవడానికి అలాగే దానితో కరోనాకు ఏదైనా సంబంధం ఉందో లేదో తెలుసుకోవడానికి పరీక్షలు
చేయడం తప్పనిసరి!



Next Story

Most Viewed