కరోనాను పాండమిక్ ‘అంటు’న్నారు!

by  |
కరోనాను పాండమిక్ ‘అంటు’న్నారు!
X

దిశ, వెబ్‌డెస్క్:

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని పాండమిక్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అయితే ఈ పాండమిక్ అంటే ఏమిటి? దీన్ని గుర్తించడానికి ప్రాతిపదిక ఎలా ఉంటుందని తెలుసుకుందాం.

పాండమిక్ అని ఒక వ్యాధిని గుర్తించడంలో ఆ వ్యాధి లక్షణాలు, వైరస్ వృద్ధి పరిగణలోకి తీసుకోరు. కేవలం వ్యాధి వ్యాప్తి వేగం, దాని భౌగోళిక పరిధిని మాత్రమే గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఒక వ్యాధి అనుకున్న దాని కంటే ఎక్కువ వేగంగా ప్రపంచంలో పలు చోట్లకు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తే దాన్ని పాండమిక్‌గా గుర్తిస్తారు.

వ్యాధి పాండమిక్ అని ఎలా గుర్తిస్తారు?

వ్యాధి ప్రబలిన దేశంలో ఓ విదేశీయుడు పర్యటించి తిరిగి తన దేశానికి వెళ్లి అక్కడ వైరస్‌ను వ్యాపించేయడాన్ని పాండమిక్ అని పరిగణించరు. కానీ తన దేశానికి తిరిగి వెళ్లే ప్రయాణంలో భాగంగా ఆ విదేశీయుడు ఇతర వ్యక్తులకు ఆ వైరస్‌ను వ్యాపింపజేసి, దాన్ని ఒక కమ్యూనిటీ వైరస్‌గా మార్చినపుడు పాండమిక్ అని పిలుస్తారు.

ఒకే దేశంలో లేదా ప్రాంతంలో పుట్టి ఆ దేశానికి పరిమితమైన వ్యాధిని ఎపిడమిక్‌గా గుర్తిస్తారు. దీనికి కమ్యూనిటీ వైరస్, కమ్యూనిటీ వ్యాప్తికి సంబంధముండదు.

ఎప్పుడు పాండమిక్‌గా గుర్తిస్తారు?

ఒక వ్యాధిని పాండమిక్‌గా గుర్తించే అధికారం కేవలం ప్రపంచ ఆరోగ్య సంస్థకు మాత్రమే ఉంటుంది. వ్యాధి వ్యాప్తి అదుపు తప్పి, నియంత్రించడానికి వీలు లేకుండా ఉండి, వీలైనంత వేగంగా అన్ని దేశాలకు వ్యాపిస్తుంటే ఆ వ్యాధిని పాండమిక్‌గా డబ్ల్యూహెచ్‌ఓ గుర్తిస్తుంది. 2003లో సార్స్ వైరస్ 26 దేశాలకు వ్యాపించనప్పటికీ దాన్ని పాండమిక్‌గా గుర్తించలేదు. ఎందుకంటే ఆయా దేశాలు ఆ వ్యాధి వ్యాప్తిని తమ దేశాలకే పరిమితమయ్యేలా నియంత్రించగలిగాయి.

ఒక వ్యాధిని పాండమిక్‌గా గుర్తించడం వల్ల లేనిపోని భయాలు కలిగించినట్లవుతుంది కాబట్టి ఈ విషయంలో డబ్ల్యూహెచ్‌ఓ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. గతంలో స్వైన్ ఫ్లూ వ్యాధిని పాండమిక్‌గా గుర్తించాలని డబ్ల్యూహెచ్‌ఓ ఆలోచన చేస్తుందని తెలిసి చాలా దేశాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. అయితే కరోనాను పాండమిక్‌గా గుర్తించిన తర్వాత ఆ వ్యాధి ఆరు రోజుల్లో తగ్గిపోతుందని, కానీ దాని వ్యాప్తిని వీలైనంత మేరకు కట్టడి చేసేందుకు ప్రయత్నించాలని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలను కోరింది.

tags :Corona, COVID 19, Virus, Pandemic, Epidemic, WHO, World Health Organization

Next Story

Most Viewed