వామ్మో.. ఏపీలో అంతమంది చనిపోయారా..?

by  |
వామ్మో.. ఏపీలో అంతమంది చనిపోయారా..?
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. నిన్న 17 మంది మరణిస్తే, గడచిన 24 గంటల్లో ఏపీలో రికార్డు స్థాయిలో 37 మంది మృత్యువాత పడడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లాలో ఆరుగురు, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 365 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారని ప్రకటించింది.

గడచిన 24 గంటల్లో ఏపీలో 1,935 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో ఏపీకి చెందిన వారు 1919 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన 13 మందికి, విదేశాలకు చెందిన ముగ్గురికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో ఏపీలో 1935 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 313, కర్నూలు జిల్లాలో 249, శ్రీకాకుళం జిల్లాలో 204, గుంటూరు జిల్లాలో 191, అనంతపురం జిల్లాలో 176, చిత్తూరు జిల్లాలో 168, పశ్చిమ గోదావరి జిల్లాలో 137, కృష్ణా జిల్లాలో 111 కేసులు నమోదయ్యాయి.

దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,103. అయితే గడచిన 24 గంటల్లో 1,030 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 14,274 మంది చికిత్స పొందుతుండగా , 16,464 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి యాక్టివ్ కేసుల కంటే డిశ్చార్జ్ కేసులు నమోదవడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed