నిజామాబాద్‌లో కరోనా హైరానా

by  |
నిజామాబాద్‌లో కరోనా హైరానా
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోన్నది. కోవిడ్ -19 పేరు చెబితేనే ప్రజల ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొన్నది. కోవిడ్ విస్తరణను అడ్డుకోవాడానికి లాక్‌డౌన్ ప్రకటించినప్పటి కంటే పాజిటివ్ కేసులు పెరిగినకొద్దీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతానికి 26 కేసులు నమోదు కాగా ఒకరి మరణం సంభవించింది. విదేశాల నుంచి వచ్చినవారి కంటే ఢిల్లీ వెళ్లి వచ్చిన మర్కజ్ సభ్యుల కారణంగా ఉమ్మడి జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తోన్నది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఢిల్లీకి వెళ్లకుండా ఒక్క దేవునిపల్లికి చెందిన బిల్డర్‌కు, బాన్సువాడకు చెందిన మరో వ్యక్తికి ఇతరుల ద్వారా సోకింది. నిజామాబాద్ జిల్లాలో 26 కేసులు యాక్టివ్‌గా ఉండగా వారి రక్త సంబంధీకులు, వారి సన్నిహితులను హోం క్వారంటైన్లో ఉంచారు. నిజామాబాద్ జిల్లాలో హోం క్వారంటైన్ లో శుక్రవారం వరకు ఉన్నది 3,756 మంది కాగా, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 35, 19 క్వారంటేన్ కేంద్రాలలో 119, నమునాలను పరీక్షలకు పంపినది 14, మర్కజ్ కు 56 మంది వెళ్లగా, గాంధీలో చికిత్స పోందుతున్నది 13 మంది ఉన్నారు.

కామారెడ్డి విషయానికి వస్తే 759 మంది హోం క్వారంటైన్‌లో, 49 మంది ప్రభుత్వ కేంద్రాల్లో క్వారంటైన్‌లో ఉన్నారు. పాజిటివ్ వచ్చిన ప్రత్యక్ష సంబంధాలు ఉన్నవారు 54 మంది, 91 మంది పాజిటివ్ వచ్చిన కుటంబాలతో సంబంధం ఉన్నవారిని గుర్తించగా, 26 మంది నమూనాలను సేకరించి పంపారు. వారి రిపోర్టులు బహిర్గతం అయితే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన తబ్లీగ్ జమాత్‌కు వెళ్లినవారు ఎంతమంది అనేది ఎవ్వరి వద్ద ఖచ్చిత సమాచారం లేదు. ఇది ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. దాని కారణంగానే అసలు మర్కజ్‌కు వెళ్లిన వారి సంఖ్య ఆధారంగా వారిని హోం క్వారంటైన్ లేదా ప్రభుత్వ క్వారంటైన్‌కు తరలించడం జరిగింది. వారిలో చాలమంది స్వచ్ఛందంగా రావాల్సి ఉండగా వారు లక్షణాలు బహిర్గతం అయ్యే సమయంలోనే బయటకు వచ్చి అప్పటి వరకు వారి రక్త సంబంధీకులకు, సన్నిహితులకు కరోనా అంటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 80 మంది వరకు ఢిల్లీ వెళ్లినట్టు చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికీ చాలామంది తబ్లీగ్‌లు వైద్య పరీక్షలను చేయించుకోవాడానికి ముందుకు రాకపోవడం ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే, చాలామంది ఢిల్లీ వెళ్లిన వారు బయటపడటం లేదనే విమర్శలు లేకపోలేదు. అందుకే వారు ఢిల్లీ వెళ్లి వచ్చి వారాలు గడుస్తున్నా పరీక్షలు నిర్వహించకుకోకపోవడంతో కరోనా విస్తరణ రెండోదశకు చేరడానికి కారణం అని చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చి కరోనా లక్షణాలు ఉన్నాయని.. వారు ప్రభుత్వ , హోం క్వారంటైన్ లో ఉండటం మంచిదే. కానీ, వారి సన్నిహితులకు పరీక్షలకు వారు సహాయ నిరాకరణ చేయడం ఆందోళన కలిగించే అంశం. ఇప్పడు ఉమ్మడి జిల్లాలో 26 పాజిటివ్ కేసులు రావడంతో అనుకున్నది జరిగిందని, ఇదే పరిస్థితి కోనసాగితే రాష్ట్రంలో నిజామాబాద్ హైదరాబాద్ తరువాత కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదుకు ఆస్కారం ఉంది.

కొనుగోళ్లపై ప్రభావం…

కోవిడ్-19 విస్తరణ కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించగా కేవలం నిత్యావసర వస్తువులు మాత్రమే అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. అందులో ఎక్కువ మొత్తం కేవలం పండ్లు, కురగాయలపై నిజామాబాద్‌లో పాజిటివ్ కేసులు పెరుగడంతో వాటిపై పడింది. సోషల్ మీడియా కారణంగా పాజిటివ్ కేసుల విషయంలో మీడియాలో వస్తున్న వార్తలు ప్రజలకు సెకన్‌ల వ్యవధిలో చేరిపోతున్నాయి. వైరల్ వీడియోలకు కొదవ లేదు. ఉమ్మడి జిల్లాలో కోవిడ్-19 కేసులు కొందరికి పరిమితమైందని ప్రజలకు మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలియడంతో ముఖ్యంగా కురగాయాలు, పండ్ల కొనుగోళ్లపై పడింది. అంతే గాకుండా చికెన్ అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు వెళ్లినవారు మీరు ఢిల్లీ వెళ్లారా.. మీ సంబంధికులు వెళ్లారా అని ప్రశ్నిస్తున్నారని చిరు వ్యాపారస్తులు వాపోతున్నారు. వేష, భాషలను, కట్టు, బొట్టు చూసి కూరగాయలు, పండ్లు కొనే పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ విస్తరణ సమయంలో కుదేలైన చికెన్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే పాజిటివ్ కేసుల కారణంగా అది కాస్తా ఢమాల్ కానుంది. సంబంధిత చికెన్, కోడి గుడ్ల వ్యాపారం ఒక వర్గం వారి చేతుల్లో ఉండగా.. వారి వద్ద కొనుగోలు చేసే వారి సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. కోవిడ్ సమయంలో
నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు పాజిటివ్ కేసులు కారణం అవుతుండటం రోడ్లపై వ్యాపారం చేసుకుంటున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతున్నది.

tags: nizamabad, Essential Items, Purchase, Delhi Markaz, Corona Effect, People, Suspicions, Vegetables

Next Story

Most Viewed