ముత్తోజిపేటలో కార్డన్ సెర్చ్

by  |
Narsampeta-11
X

దిశ, నర్సంపేట: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో నర్సంపేట డివిజన్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట గ్రామంలో పోలీసులు శనివారం సాయంత్రం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నర్సంపేట ఏసీపీ ఫణిందర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారి నుండి మద్యం సీలను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రూ. 27వేల విలువ గల మద్యం సీసాల్ని స్వాధీనం చేసుకోగా, 17 ద్విచక్ర వాహనాలకు జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ ఫణిందర్ మాట్లాడుతూ… యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రయాణాల్లో హెల్మెట్ వాడకం తప్పనిసరి అని, వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించాలని గుర్తు చేశారు. కార్డన్ సెర్చ్ లో నర్సంపేట టౌన్ సీఐ పులి రమేష్, ఎస్సైలు రవీందర్, రాం చరణ్, పెద్ద ఎత్తున డివిజన్ లోని మిగతా మండలాల ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Next Story