రాజీవ్ నగర్ లో కార్డెన్ సెర్చ్

by  |
carden-search-2
X

దిశ, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో ఏసీపీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లల్లో సోదాలు చేసి సరైన పత్రాలు లేని 80 బైకులు, 10 ఆటోలు, 3 టాటా మేజిక్ వాహనాలు, రూ. 2 వేల నిషేధిత గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు రక్షణ, భద్రత భావం కల్పించడం, కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా గంజాయి, నిషేధిత గుట్కా, గుడుంబా తయారీ, బెల్ట్ షాపులు, ఇసుక, కలప అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్డెన్ సెర్చ్ లో పట్టణ సీఐ నారాయణ నాయక్, లక్సెట్టిపేట సర్కిల్ సీఐ ఖరీముల్లా ఖాన్, మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్, మరో సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు కిరణ్ కుమార్, దేవయ్య, ప్రవీణ్, సబ్ డివిజన్ లోని ఎస్ఐలు,పీఎస్సైలు, స్పెషల్ పార్టీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

carden-search-1

Next Story

Most Viewed