కూలర్ల రిపేరు లేదు.. కుండల జాడలేదు !

by  |
కూలర్ల రిపేరు లేదు.. కుండల జాడలేదు !
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా గజగజ వణికిస్తూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ప్రజలను ఇంటికే పరిమితం చేసిన కరోనా వైరస్‌ ఇప్పుడు మరో విధంగా పగ తీర్చుకుంటోంది. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్ ప్రకటించిన కరెక్ట్‌ టైంకే ఎండవేడిమి విపరీతంగా పెరగడంతో హోం క్వారంటైన్ చేస్తున్న పీపుల్స్‌కు భానుడి సెగ తగులుతోంది. దీంతో ఇంట్లో ఉండలేక, అటు బయట కాలు పెట్టలేక జనాలు టార్చర్ అనుభవిస్తున్నారు. వారంరోజులుగా సూర్యుడు సుర్రుమంటూ ఇంట్లో ఉన్నవాళ్ల మాడు పగులగొడుతుండటంతో ఇంట్లోనే కుతకుత ఉడికిపోతున్నారు.

మార్చి చివరివారంలో మనదేశంలో ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, నగరాల్లో ఉద్యోగాలు చేసే వారు ఉదయం 10 వరకు డ్యూటీకెళ్లి మళ్లీ భానుడి ప్రతాపం తగ్గాక సాయంత్రం 5గంటల సమయంలో ఇంటికి వచ్చేలా ప్లాన్ చేస్తూ సమ్మర్‌ను ఎల్లదీస్తారు. అయితే ఇంటిపట్టున ఉండి రెస్ట్‌ తీసుకునే వారు మాత్రం కూలర్లు ఏర్పాటు చేసుకొని, కుండల చల్లటి నీటిని తాగుతూ సేద తీరుతారు. అటు రిచ్ పీపుల్స్ అయితే ఏసీలు మెయింటేన్ చేస్తూ ఉష్ణ ప్రతాపం నుంచి ఉపశమనం పొందుతారు. కానీ కరోనా పుణ్యమా అని సామాన్య ప్రజలకు కూలర్లు, కుండలు అందుబాటులో లేని పరిస్థితులు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో మార్కెట్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. కనీసం కూలర్ల రిపేర్ల షాపులు తెరవకపోవడం, బయట అమ్మే కుండలు కొనుక్కునే సిచ్వుషన్ దారిదాపులో లేకపోవడంతో నార్మల్ పీపుల్స్‌ నానా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ కట్టడి కాకుంటే లాక్‌డౌన్ పొడిగిస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అప్పటివరకు ఎండవేడిమి ఎలా తట్టుకోవాలి, చల్లటి నీటిని ఏర్పాటు చేసుకోవడం కోసం ఎప్పటివరకు వేచి చూడాలని టెన్షన్ పడిపోతున్నారు. ఈ క్రమంలోనే తెలిసిన వారితో కూలర్లు రిపేరు చేయించే వెసులుబాటు ఉన్నా.. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితులు ఉండటంతో ప్రజలు కూలర్లు, కుండలు సమకూర్చుకోవడం కలగానే మిగిలి పోతుంది.

దాదాపు ఎండకాలం పూర్తయ్యే వరకు లాక్‌డౌన్ ఎత్తివేసే పరిస్థితి లేకపోవడంతో ఇంట్లో ఉన్న బిందెలకే మెత్తటి క్లాత్ చుట్టి అంతో ఇంతో చల్లగైన నీటిని తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. రేకులు ఇళ్లలో నివసించేవారు మధ్యాహ్నం సమయంలో ఎండవేడిమి తట్టుకోలేక ఇంటి ఆవరణలో ఉన్న చెట్ల కింద కాలం ఎల్లదీస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ కరోనా పుణ్యమా అని పేద ప్రజలకు కూలర్లు, కుండలు అందుబాటులో లేని పరిస్థితులు తలెత్తడంతో ప్రజలు కరోనాను ఆడిపోసుకుంటున్నారు.

Tags: corona virus effect, lockdown, coolers, pottery or people’s problems, rural areas, cities, markets, police


Next Story