సివిల్ ఆస్పిరెంట్స్‌‌‌కు సక్సెస్ కోడ్ చెబుతున్న ఐఏఎస్ అధికారి

by  |
సివిల్ ఆస్పిరెంట్స్‌‌‌కు సక్సెస్ కోడ్ చెబుతున్న ఐఏఎస్ అధికారి
X

దిశ, ఫీచర్స్: ప్రభుత్వ ఉద్యోగం కోసం కొన్నేళ్లపాటు కష్టపడుతుంటారు ఆస్పిరెంట్స్. అయితే పరీక్షలో తమ బెస్ట్ ఇచ్చినా, ఒకటి లేదా రెండు మార్కులతో ఫెయిలై తమ కలకు అడుగుదూరంలో నిలిచిపోతుంటారు. అయినా పట్టువిడవకుండా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అప్పుడు కూడా ఫలితం అదే అయితే నిరాశతో కుంగిపోతారు. పట్నాకు చెందిన మనోజ్ కుమార్ పరిస్థితి కూడా అదే. మూడుసార్లు బీహార్ స్టేట్ సివిల్ సర్వీస్‌ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా తన లక్ష్యాన్ని చేరుకోలేదు. అలాంటి సమయంలోనే ఓ యంగ్ ఆఫీసర్ వీడియోలు చూసి తన ‘ఫెయిల్యూర్‌ను సక్సెస్’గా ఎలా మలుచుకోవాలో తెలుసుకున్నాడు. ఒక్క మనోజ్ మాత్రమే కాదు వేలాదిమంది ఆశావాహులను ఆ అధికారి ఓటమి నుంచి గెలుపు వైపు నడిపిస్తున్నాడు.

పబ్లిక్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యే సమయంలో చాలా కూల్‌గా, ప్లెజెంట్‌ అండ్ పాజిటివ్‌‌ మైండ్‌తో ఉండాలి. తోటి మిత్రులు ఉద్యోగంలో స్థిరపడి మంచి జీతం పొందుతున్నారు. తోటి ఆస్పిరెంట్స్ ర్యాంకులు కొట్టి తమ కల నెరవేర్చుకుంటున్నారు. నేను ఎందుకు సాధించలేకపోతున్నాను అని బాధపడి మనపై మనం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యం వైపు సాగిపోవాలి. కానీ కొంతమంది ఓటమి పలకరించగానే ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుంటారు. అలాంటి వాళ్లలో ఉత్సాహం నింపి, సక్సెస్ బాట పట్టించేందుకు 2010 బ్యాచ్ IAS అధికారి, బీహార్ ప్రభుత్వ సమాచార ప్రజా సంబంధాల విభాగం (IPRD) డైరెక్టర్ కన్వల్ తనూజ్ కృషి చేస్తున్నాడు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి ‘KTSir కెరీర్ టాక్స్’ పేరుతో సోషల్ మీడియాలో వీడియోలు అందిస్తున్నాడు. తనూజ్ అందిస్తున్న ఇన్‌స్పిరేషనల్ స్పీచ్‌లు నిరాశవాదుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి.

యువతను ప్రేరేపించాలనే ఆలోచన ఔరంగాబాద్, కతిహార్ జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్నప్పుడు ప్రారంభమైంది. ఈ మేరకు ప్రజా సమస్యల కోసం ‘డిస్ట్రిక్ మెజిస్ట్రేట్’తో చర్చించండి అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించాడు. దీనికి మంచి స్పందన రావడంతో అలాగే కొనసాగిస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే ప్రతి శని, ఆదివారాల్లో యూట్యూబ్ వేదికగా తన కెరీర్ టాక్స్‌ కొనసాగించాడు. ప్రతీ రోజు కోర్టు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కెరీర్ అడ్డంకులు, పోటీ పరీక్షల్లో వైఫల్యాలకు కారణాలు, ఎక్కడ వెనకబడుతున్నారు, ఎలాంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి, ఎలా సన్నద్ధం కావాలి, లోపాల్ని సరిదిద్దుకోవడం ఎలా, యువతను నిరాశపరుస్తున్న అంశాలేంటి? వంటి రకరకాల కోణాల నుంచి పాయింట్లను సిద్ధం చేసుకుని చెబుతాడు.

‘యువతను ప్రేరేపించడం దేశానికి సేవ చేయడం లాంటిది. లైవ్ ప్రసారంతో పాటు ఉపన్యాసాలను రికార్డ్ చేస్తాను. ఎవరైనా సమస్యను లేవనెత్తినప్పుడు, మొదట అకడమిక్ మార్గాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత ఆస్ట్రాలాజికల్లీ సమస్యను విశ్లేషిస్తాను. ఎప్పటికీ ఆశను కోల్పోవద్దని, ఓటమి తాత్కాలికమే కానీ విజయం చరిత్రలో నిలిచిపోతుందని పదే పదే వివరిస్తుంటాను. ప్రపంచ చరిత్ర, సైన్స్‌తో పాటు వేద గ్రంథాల స్నిప్పెట్‌లను కూడా వివరిస్తాను. జ్యోతిష్యం అనేది మెటాఫిజిక్స్‌కు చెందిన శాస్త్రం, ఇది కౌన్సెలింగ్‌లో సహాయపడుతుందని నమ్ముతాను. సూర్యాస్తమయం ముందే నిద్రలేచి చదవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. సంకల్పం ద్వారా విజయం కోసం కృషి చేయండి. కులాలు, మతాలకు అతీతంగా పేదలకు సేవకుడిగా ఉండాలన్నదే అభిమతంగా ముందుకు సాగుతున్నాను.
– తనూజ్



Next Story

Most Viewed