ప్యాకేజ్ ఇవ్వనందుకే ఓడిపోయాం: రేవంత్ రెడ్డి

by  |
ప్యాకేజ్ ఇవ్వనందుకే ఓడిపోయాం: రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటమికి మీడియానే కారణమంటూ టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్​లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన రేవంత్​ మీడియా రంగాన్ని టార్గెట్​ చేశారు. గ్రేటర్‌లో కాంగ్రెస్ ఓటమికి మీడియానే కారణమని, ఎన్నికల్లో మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించలేదని ధ్వజమెత్తారు.

ఈ ఎన్నికల్లో మీడియా ఏకపక్షంగా వ్యవహరించిందని, కాంగ్రెస్ ఓటమికి ఓటర్లు కారణం కాదని మీడియానే కారణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు మీడియాను ప్యాకేజీలతో మ్యానేజ్ చేశాయని, తెలంగాణలో ప్రతి రాజకీయ పార్టీ ఒక చానెల్​ పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని, దీంతో ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోతుందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 2016లో 10.4 శాతం ఓట్లు వచ్చినా ఎక్కడా చూపించలేదని, మొత్తం బీజేపీ భజన చేశారన్నారు. అయినప్పటికీ గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించామని, కాంగ్రెస్​ ఓటుబ్యాంకు 4 శాతం పెరిగిందన్నారు.

కాంగ్రెస్​ను చంపేందుకు మీడియా సుపారీ తీసుకుందని, కానీ చంపుతోంది కాంగ్రెస్​ను కాదని ప్రజాస్వామ్యాన్ని అంటూ రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని హత్య చేసే విధంగా మీడియా తయారైందని మండిపడ్డారు. అందుకే మీడియా ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆకురౌడీ వంటి టీఆర్​ఎస్​ పోయి ఇప్పుడు పెద్ద రౌడీలాంటి బీజేపీ దిగారని రేవంత్​రెడ్డి విమర్శించారు. మెయిన్​ స్ట్రీమ్​ మీడియా విపరీతపోకడలతో ప్రజాస్వామ్యం ఘోరంగా దెబ్బతిందన్నారు.

కనీసం ఇప్పటికైనా విశ్లేషణ చేసుకుని ప్రతిపక్ష పార్టీకి తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇక గ్రేటర్​ ఎన్నికల్లో ప్రధాని నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రచారం చేశారని, కేంద్రం నుంచి బీజేపీ అగ్రనేతలు దేశం నలుమూలల నుంచి వచ్చి ప్రచారం చేశారన్నారు. టీఆర్​ఎస్​ తరుఫున మంత్రులు గల్లీల్లో కూడా తిరగారన్నారు. మత విద్వేషాలు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్నారు. ఇంత కష్టకాలంలో కాంగ్రెస్‌ జెండా మోసిన కార్యకర్తలకు రుణపడి ఉంటామని రేవంత్​రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed