సీఎంగా కేటీఆర్ కంటే.. ఈటల బెస్ట్: జీవన్‌రెడ్డి

by  |
సీఎంగా కేటీఆర్ కంటే.. ఈటల బెస్ట్: జీవన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే కేటీఆర్‌కు సీఎం కావడానికి అవకాశం ఉండవచ్చని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సీఎం అయ్యేందుకు కేటీఆర్ సమర్థుడేనని, కానీ వారసత్వ ముద్ర ఆయనపై ఉందని, కేటీఆర్‌కు బదులు మంత్రి ఈటలను సీఎం చేస్తే పార్టీలో ఎవరూ వ్యతిరేకించరన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, నూతన వ్యవసాయం చట్టాలపై మాట్లాడిన మంత్రి ఈటలను తాను అభినందిస్తున్నట్లు జీవన్​రెడ్డి తెలిపారు. సీఎంగా కేటీఆర్‌ కన్నా ఈటలను చేస్తే బాగుంటుందని, కేటీఆర్ సమర్ధుడే కావొచ్చు, కానీ విమర్శలు వస్తాయన్నారు.

అదే విధంగా పసుపు బోర్డ్ ఏర్పాటుకు.. పసుపు రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం లేఖ రాసినట్లు జీవన్​రెడ్డి తెలిపారు. గతంలో క్వింటాల్ పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేదని.. ఇప్పుడు తులం బంగారం రూ.50వేలకు పెరిగిందని, పసుపు మాత్రం రూ.6వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు 100రోజుల్లో ఏర్పాటు చేస్తామని బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన ఎంపీ అరవింద్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

Next Story

Most Viewed