నాయిని రాజేందర్ రెడ్డి హౌస్ అరెస్ట్

by  |
నాయిని రాజేందర్ రెడ్డి హౌస్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐసీసీ ఆదేశాల మేరకు, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధమైన జిల్లా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకొని నాయిని సహా పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… అరెస్టులు అప్రజాస్వామికం, కనీసం నిరసన తెలియజేసే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్‌లో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు హైదరాబాద్‌కు వెళ్తుండగా అరెస్టులు చేయడం సరికాదన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, అక్రమ అరెస్టులను ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఖండించాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed