మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి షాక్.. కాంగ్రెస్ ఫిర్యాదు

by  |
మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి షాక్.. కాంగ్రెస్ ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మండలి టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ ఆఫీసర్ తో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నేతలు.. మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీమంత్రి షబ్బీర్ అలీ, తదితరులు ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు. ఐఏఎస్ గా పలు అవినీతి ఆరోపణలు, విచారణ సంస్థల విచారణలు, కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయంటూ కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఐఏఎస్‌గా పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, కోర్టు ధిక్కారణ కేసులు ఉన్నా నామినేషన్ ను ఎలా తీసుకుంటారని రిటర్నింగ్ ఆఫీసర్‌ను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, డీవోపీటీ ఆమోదం తెలిపిన తర్వాతే వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను ఆమోదించాలని రిటర్నింగ్ అధికారిని కోరామన్నారు. ఎన్నికల అధికారులు టీఆర్ఎస్‌కు సహకరిస్తున్నారని, నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలన్నారు. నామినేషన్ వేసిన పత్రాలను ఏ రోజుకు ఆరోజు ఆన్ లైన్ లో పెట్టాలని, నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ లో పెట్టడం ద్వారా అభ్యర్థులు ఏవైనా తప్పుడు సమాచారం ఇస్తే, ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. నామినేషన్ పత్రాల వివరాలు ఇవ్వాలని అడిగితే రిటర్నింగ్ అధికారి స్పందించడం లేదన్నారు. ఎన్నికల అధికారులు సరైన విధంగా స్పందించకపోతే న్యాయస్థానం తలుపుతడతామని తెలిపారు.

నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరగడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఒక్కరోజులోనే ఆమోదించడం జుగుప్సాకరమని అన్నారు. వెంకట్రామిరెడ్డిపై ఉన్న కేసులపై క్లియరెన్స్ ఇవ్వకుండా రాజీనామా ఎలా చేస్తారు? నామినేషన్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఆయన నామినేషన్ వేసిన విధానం కూడా పద్ధతి ప్రకారం లేదన్నారు. అసలు అప్లికేషన్ కూడా కరెక్ట్ గా లేదని ఆరోపించారు. ఒక అధికారిగా పూర్తి స్థాయిలో టీఆర్‌ఎస్‌కి పనిచేశారని, అప్పట్లోనే కేసీఆర్ కాళ్లు మొక్కి పరువు తీసారని ఎద్దేవా చేశారు. అతని అవినీతిపై చర్యలు తీసుకుని నామినేషన్ రిజెక్ట్ చేయాలని అసెంబ్లీ మండలి రిటర్నింగ్ ఆఫీసర్‌ను కోరామన్నారు.

Next Story

Most Viewed