నెలాఖరులోపు పాఠశాలల్లో ప్రగతి పనులు పూర్తి చేయాలి : కలెక్టర్

by Aamani |
నెలాఖరులోపు పాఠశాలల్లో ప్రగతి పనులు పూర్తి చేయాలి : కలెక్టర్
X

దిశ,నారాయణపేట ప్రతినిధి: జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక వసతుల నిర్మాణ పనులను నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు సంబంధించిన అభివృద్ధి నిర్మాణ పనులపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.... జూన్ 30 లోపు పాఠశాలలో వివిధ నిర్మాణ, అవసరమైన మరమ్మతు పనులను పూర్తి చేస్తే, జూన్ మొదటి వారంలో పాఠశాలలకు రంగులు వేయించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని మండలాల వారీగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఎన్ని నిర్మాణ పనులు మంజూరయ్యాయి? ఎన్ని ప్రారంభించారు? ఇంకా ఎన్ని ప్రారంభించాల్సి ఉందని కలెక్టర్ పంచాయతీరాజ్ ఏఈలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ప్రారంభించాల్సి ఉన్న పనులను రెండు రోజుల్లో మొదలుపెట్టి నెలాఖరుకు పూర్తిచేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా మరికల్ మండల కేంద్రంలోని పాఠశాలలను పరిశీలించి, పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కు ఎస్టిమేట్ తయారు చేసి ఇవ్వాలని, వెంటనే ఆయా పాఠశాలల్లో నిర్మాణ పనులను పూర్తి చేయాలని పీఆర్ డిఈఈ ని ఆదేశించారు. అలాగే మద్దూరు, కోస్గి మండలాల్లోనూ చేపట్టిన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. ఊట్కూరు మండలంలోని కొల్లూరు, పెద్దపొర్ల , మొగ్దూంపూర్ పాఠశాలల్లో ప్రతిపాదించిన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. మాగనూర్ మండలంలోని వడ్వాట్ గ్రామ పాఠశాలలో ఎందుకు పనులు నిలిచి పోయాయని ఏ ఈ ని ప్రశ్నించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సమన్వయం చేసుకొని పనులు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ తదితరులు పాల్గొన్నారు.

17 నుంచి 31 వరకు జిల్లాలో వర్షాలు...

17 నుంచి 31 వరకు తెలంగాణ అంతటా ప్రత్యేకించి నారాయణపేట జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరియు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రకటనలో తెలిపారు. వర్షా భావ దృష్ట్యా, రైతులు పండించిన వరిని రక్షించుకోవడానికి రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. పండించిన వరి గింజలను కప్పడానికి టార్పాలిన్‌లను ఉపయోగించాలన్నారు.

Advertisement

Next Story