రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పోయినట్టేనా..?

by  |
Congreess, bjp
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ పోటికి దిగింది. మొత్తం 12 స్థానాలకుగానూ రెండు చోట్ల బరిలో ఉండేందుకు అభ్యర్థులు నామినేషన్​ దాఖలు చేశారు. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై ఆశలు పెట్టుకుని పోటీకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీకి బీజేపీ లోపాయికారికంగా మద్దతుగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే హస్తం నేతలు.. కాషాయ దళంతో సంప్రదింపులు సైతం మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అక్కడ మీకు.. ఇక్కడ మాకు

ఇటీవల జరిగిన హుజురాబాద్​ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్​పార్టీ.. బీజేపీకి సహకరించిందని ఆరోపణలున్నాయి. దీనిపై కాంగ్రెస్​నేతలు బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో బీజేపీ దూరంగా ఉంది. కాంగ్రెస్​ మాత్రం ఖమ్మం, మెదక్​స్థానాల్లో పోటీ చేస్తోంది. మెదక్​ నుంచి టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల పోటీలో ఉంది. ఇక్కడ 230 ఓట్లు కాంగ్రెస్‌కు ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకుంటే కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీకి ఉన్న ఓట్లు కూడా తమకు వస్తే గెలుపు ఆశ ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​నేతలు బీజేపీతో మంతనాలు సాగిస్తున్నారు. ఎలాగూ హుజురాబాద్​అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మద్దతుగా ఉన్నామని, ఇప్పుడు మండలి ఎన్నికల్లో తమకు సహకారం అందించాలంటూ చర్చలు పెడుతున్నారు.

కాగా కాంగ్రెస్​పార్టీ ప్రస్తుతం రెండు స్థానాల్లోనే పోటీ చేస్తుంది. మెదక్​నుంచి నిర్మల, ఖమ్మం నుంచి నాగేశ్వర్​రావు నామినేషన్​దాఖలు చేశారు. మంగళవారం ఉదయం వరకు కూడా నిజామాబాద్​నుంచి పోటీ చేస్తారని భావించారు. కానీ అనూహ్యంగా అక్కడ పోటీకి విరమించుకున్నారు. వాస్తవానికి నిజామాబాద్​స్థానం నుంచి కేసీఆర్​ కుమార్తె కవిత పోటీకి దిగిన విషయం తెలిసిందే. దీంతో కవితను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేయాలంటూ ప్రాథమికంగా చర్చించుకున్నారు. కానీ పరిణామాలు మారిపోయాయి. నిజామాబాద్​స్థానం నుంచి పోటీకి కాంగ్రెస్​ తప్పుకుంది.


Next Story