భూ పంచాయితీ విషయంలో ఇద్దరి గొడవ.. 40 మంది పై కేసు

by  |
భూ పంచాయితీ విషయంలో ఇద్దరి గొడవ.. 40 మంది పై కేసు
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ ప్లాటు పంచాయితీ విషయంలో గాంధీ చౌక్ వద్ద కౌన్సిలర్ రహీం, మరో వ్యక్తి ఉస్మాన్ ఇరువురి మద్య గురువారం ఉదయం జరిగిన ఘర్షణపై పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. దీంతో ఆగ్రహించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు వర్గం తమ పైన దాడి చేసి తిరిగి తమ పైనే పోలీసులు కేసులు నమోదు చేయడం దారుణమని అంటూ కొల్లాపూర్ లోని ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు.

దీంతో ప్రయాణీకులకు, పట్టణవాసులకు ఇబ్బంది కలిగించారన్న సాకుతో పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ధర్నాకు పాల్పడిన 40 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కొల్లాపూర్ పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో జూపల్లి వర్గానికి చెందిన కౌన్సిలర్ లపై కేసులు నమోదు కావడం ఉద్రిక్తతకు దారి తీసింది.



Next Story

Most Viewed