చేపలు పట్టే విషయంలో 2 గ్రామాల మధ్య గొడవ.. ప్రతి ఏటా ఇదే తంతు!

by  |
Godava1
X

దిశ, పరిగి: చేపలు పట్టే విషయంలో రెండు గ్రామాల ప్రజల మధ్య గొడవ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పరిగి మండలం సొండేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పెరుమళ్ల చెరువు ఉంది. ఆ చెరువులో మత్స్యశాఖ ద్వారా సొండేపూర్ గ్రామస్తులు 17 వేల చేప పిల్లలను వదిలారు. కాగా ఈ చెరువులోని శిఖం భూములు మా గ్రామ రైతులవంటూ బాబాపూర్ గ్రామస్తులు కొందరు చెరువులో చేపలు పట్టేందుకు శనివారం వెళ్లారు. చేపలను మా గ్రామ పంచాయతీ నుంచి వదిలామని.. మీరు ఎందుకు పట్టుకుంటారంటూ షొండేపూర్ గ్రామస్తులు బాబాపూర్ గ్రామస్తులును అడిగారు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ చిలికి చిలికి గల్లాలు పట్టుకునే వరికు చేరింది. విషయం తెలుసుకున్న పోలీసులు చెరువు వద్దకు వెళ్లి ఇరు గ్రామస్తుల్లో కొందరిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఇరు గ్రామస్తులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా గ్రామ టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ఈ చెరువులో చేపలు పట్టే విషయంలో గొడవ జరుగుతుందని ఈ విషయై కలెక్టర్ కు ఫిర్యాదు చేశామన్నారు.

Next Story

Most Viewed