పారిశుధ్య పనులు ఆగొద్దు : కమిషనర్ పమేలా

by  |
పారిశుధ్య పనులు ఆగొద్దు : కమిషనర్ పమేలా
X

దిశ, వరంగల్ :
గ్రేటర్ వరంగల్ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రత్యేక పారిశుధ్య పనులు పకడ్బందీగా జరగాలని కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రధాన కార్యాలయంలో పర్యవేక్షణ అధికారులతో ఆమె సమావేశమై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..కార్పొరేషన్‌లోని 58 డివిజన్లలో ఈ నెల1 నుంచి 8 వరకు రోజువారీగా క్లీనింగ్ కార్యక్రమాలను పక్కా ప్రణాళికతో నిర్వహించాలన్నారు.అందుకు ప్రతి డివిజన్‌కు శానిటరీ ఇన్‌స్పెక్టర్ స్థాయి వారిని ప్రత్యేక అధికారిగా, ప్రతి ఐదు డివిజన్లకు ఒక సూపర్వైజర్ అధికారిని నియమించినట్టు వివరించారు. ప్రతిరోజూ సాయంత్రం 5 నమూనాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి అందుకు సంబంధించిన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పనులు చేపట్టక ముందు, చేసిన తర్వాత ప్రతి పనినీ డాక్యుమెంటేషన్ చేయాలన్నారు. డివిజన్‌లో పారిశుధ్య పనుల బాధ్యత ప్రత్యేక అధికారిపై ఉన్నందున, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.మురుగు కాలువల్లో తీసిన పూడిక, చెత్తను వెంటనే తరలించాలన్నారు. ఖాళీ ప్లాట్లు, లోతట్టు ప్రాంతాలు, నిర్మాణాల వ్యర్ధాలు, శిథిలాలను ప్రతి వార్డులో గుర్తించాలన్నారు.గత పట్టణ ప్రగతి కన్నామెరుగైన ఫలితాలు సాధించేలా అందరూ కలసికట్టుగా కష్టపడి పని చేయాలని ఆమె చెప్పారు.సమావేశంలో ఎంహెచ్‌ఓ రాజి‌రెడ్డి, ఆర్‌ఎఫ్‌ఓ నారాయణ రావు, సీహెచ్‌ఓ సునీతా, ఉప కమిషనర్ రాజు, ప్రత్యేక అధికారులు, పర్యవేక్షణ అధికారులు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Next Story

Most Viewed