రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి

by  |
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
X

దిశ, మెదక్:
మెదక్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలను తీసుకోవాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని మెదక్ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లు, తదితర అంశాలపై జిల్లా అధికారుతో సమీక్షా సమావేశాన్ని ఆయన మంగళవారం నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ… మెదక్ జిల్లా వ్యాప్తంగా 309 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు తీసుకువచ్చిన వెంటనే పంట కొనుగోలు చేయడంతో పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో రైస్ మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమయ్యేలా అవసరమైన చర్యలను తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.


Next Story

Most Viewed