గజగజ వణికిన ఢిల్లీ..

by  |
గజగజ వణికిన ఢిల్లీ..
X

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీ చలికి వణుకుతూ కొత్త ఏడాదిని ఆహ్వానించింది. ఈ శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలను ఏడాది తొలిరోజే నమోదుచేసుకుంది. ఢిల్లీలో శుక్రవారం 1.1 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్టు సఫ్దార్‌జంగ్ అబ్జర్వేటరీ వెల్లడించింది. ఢిల్లీలో జనవరి మాసంలో ఇంత తక్కువస్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడం 15ఏళ్లలో ఇదే తొలిసారి.

చివరి సారి 2006 జనవరి 8న 0.2 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నమోదైంది. గతేడాది జనవరిలో కనిష్టంగా 2.4 డిగ్రీలు రిపోర్ట్ అయింది. ఈ సారి తొలి రోజునే టెంపరేచర్ 1.1 డిగ్రీలకు పడిపోయింది. దట్టమైన మంచుపొరలూ నగరాన్ని అలుముకున్నాయని వాతావరణ శాఖ అధికారి కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. శనివారం నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని, 1.1 డిగ్రీలు ఈ శీతాకాలపు అత్యల్ప ఉష్ణోగ్రతగా నమోదవుతుందని అన్నారు.

Slug :


Next Story