మర్కుక్ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్

by  |
మర్కుక్ సర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్
X

దిశ, న్యూస్ బ్యూరో: కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మర్కుక్ సర్పంచ్ భాస్కర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ప్రారంభోత్సవంతో పాటు పరిసరాల్లో చేపట్టాల్సిన పర్యాటకాభివృద్ధి పనుల గురించి వివరించారు. రిజర్వాయర్ దగ్గర పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించాల్సిందిగా సర్పంచ్‌కు సూచనలు చేసిన కేసీఆర్ కనీసం 15 ఎకరాల స్థలాన్ని సేకరించాలని స్పష్టం చేశారు. స్థలాన్ని సేకరించిన తర్వాత ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాధాన్యత కలిగి ఉండేలా ఏ తీరులో అభివృద్ధి చేయవచ్చో వివరించారు. సర్పంచ్‌కు స్వయంగా ఫోన్ చేసిన కేసీఆర్ రిజర్వాయర్ అంశంతో పాటు మర్కుక్ గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులపైనా చర్చించారు. రిజర్వాయర్‌ ప్రారంభోత్సవంతో పాటు ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలో సూచించారు. ప్రారంభోత్సవం రోజున సుమారు రెండు వేల మంది హాజరయ్యేలా కార్యక్రమాన్ని రూపొందించాలని, వారందరికీ అక్కడే భోజన ఏర్పాట్లు కూడా చేయాలని సీఎం స్పష్టం చేవారు.

ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోని జలాశయం గురించి కూడా చర్చించినట్లు తెలిసింది. మర్కుక్ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్న ఆలోచనలను సర్పంచ్ ద్వారా తెలుసుకున్న కేసీఆర్ పకడ్బందీ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed