వైద్యారోగ్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు..

by  |
CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. పబ్లిక్, ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్ రోగులతో నిండిపోయాయి. కొత్తగా నమోదయ్యే కేసులకు బెడ్లు, ఆక్సిజన్ దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై సమీక్షించాలన్నారు. కొవిడ్ కేర్ ఆస్పత్రుల్లో రోగులు వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్నందున అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.

గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల దగ్గర ఫైరింజన్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆక్సిజన్ ను సైనిక విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకొస్తున్నామని, అవసరమైన ఆస్పత్రులకు చేరేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఇళ్లలో చికిత్స పొందుతున్న వారిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని తెలిపారు. కరోనా పరీక్షల కిట్ల కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Next Story