అమర జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షలు

256

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో ఇప్పటివరకు 24 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ భీకర కాల్పుల్లో మరో 16 మంది జవాన్లు తీవ్రంగా గాయపడగా.. ఇందులో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా 31 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు జరుగుతున్న క్రమంలో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

అయితే నక్సల్స్ దాడిలో వీరమరణం పొందిన జవాన్లలో ఏపీకి చెందిన ఇద్దరు జవాన్లు ఉన్నారు. దీంతో ఆ ఇద్దరి జవాన్ల కుటుంబాలకు  ఆర్థిక సహాయం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..