కర్నూలు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

by  |
cm jagan
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై టెంపో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. ప్రమాద సమయంలో టెంపోలో 18 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులంతా చిత్తూరు జిల్లా మదనపల్లె వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. మదనపల్లి నుంచి రాజస్థాన్‌లో అజ్మీర్ దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.



Next Story

Most Viewed