ఐదు స్థానిక భాషల్లో ‘క్లబ్‌హౌస్’ చాట్ రూమ్స్

by  |
ఐదు స్థానిక భాషల్లో ‘క్లబ్‌హౌస్’ చాట్ రూమ్స్
X

దిశ, ఫీచర్స్ : పాపులర్ సోషల్ ఆడియో యాప్ ‘క్లబ్‌హౌస్’ తన ప్లాట్‌ఫామ్‌ను ప్రజలకు మరింత చేరువ చేరే ప్రయత్నంలో 13 కొత్త భాషలను యాడ్ చేసింది. ఈ జాబితాలో హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు వంటి 5 భారతీయ భాషలు కూడా ఉండటం విశేషం. న్యూ అప్‌డేట్‌‌లో ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు మాత్రమే ఈ ఫెసిలిటీ అందుబాటులోకి రాగా, త్వరలోనే ఐవోఎస్ వినియోగదారులకు కూడా ఈ సర్వీస్ వస్తుందని కంపెనీ పేర్కొంది.

భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, జర్మన్, ఇండోనేషియన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, పోర్చుగీస్(బ్రెజిలియన్), స్పానిష్ వంటి ఇతర భాషలకు కూడా క్లబ్‌హౌస్ తమ మద్దతునిస్తుంది. ఇక‌పై యాప్‌లో.. ప్రాంప్ట్స్, నోటిఫికేషన్స్, క్లబ్ పేర్లను స్థానిక భాషల్లోనే పెట్టుకోవచ్చు. ఈ యాప్ గత కొన్ని నెలలుగా భారత్‌లో భారీ వృద్ధిని సాధించగా, చాలా మంది వినియోగదారులు స్థానిక భాష మద్దతు కోసం అడుగుతున్నారు. ఇందుకోసం ఎప్పటినుంచో అభ్యర్థిస్తున్న మలయాళీలు ఇప్పటికే బోలెడు చార్ట్ రూమ్స్ హోస్ట్ చేస్తుండగా, స్థానిక భాషకు అవకాశం రావడంతో ఇక రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవకాశముంది.

క్లబ్‌హౌస్ అనేది ఒక సామాజిక ఆడియో యాప్. ఇక్కడ వినియోగదారులు చాట్ రూమ్స్ ద్వారా బిగ్ గ్రూప్స్‌ లేదా కమ్యూనిటీలతో కమ్యూనికేట్ చేయవచ్చు. ఒకరు హోస్ట్‌గా వ్యవహరించి శ్రోతలతో తమ ఆలోచనలను పంచుకుంటారు. అవసరమైతే ప్రేక్షకులు కూడా తమ వాయిస్ వినిపించొచ్చు. ఇది అనేక విధాలుగా ట్విట్టర్ స్పేసెస్ లేదా ‘డిస్కార్డ్స్ స్టేజ్ డిస్కవరీ ఫీచర్‌’తో సమానంగా ఉంటుంది. వాస్తవానికి, వాటికి బ్లూప్రింట్‌ అని చెప్పొచ్చు. వినియోగదారులు సంబంధిత అంశాల కోసం శోధించవచ్చు, వాటిని వినడానికి క్లబ్‌ల జాబితాను చూడవచ్చు.

Next Story

Most Viewed