చ‌స్తున్నా.. ఆ షాపులు మూయించ‌రా : భ‌ట్టి

by  |
చ‌స్తున్నా.. ఆ షాపులు మూయించ‌రా : భ‌ట్టి
X

దిశ‌, మ‌ధిర: విచ్చ‌ల‌విడిగా సాగుతున్న‌ బెల్ట్ షాపులపై దాడులు చేయ‌రా? అంటూ సీఎల్పీ లీడర్, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రుపాలెం మండ‌లంలోని రాజుపాలెం, గట్లగౌరారం, కొత్తపాలెం వద్ద ఉన్న సరిహద్దు చెక్ పోస్టుల‌ను ఆదివారం భ‌ట్టి విక్ర‌మార్క‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకులకు ప్రజల బాగోగులు పట్టవా..? అంటూ కోపోద్రిక్తులయ్యారు. రాజుపాలెం పంచాయతీ సెక్రెటరీ శివతో మాట్లాడుతూ.. బెల్టుషాపులను నిర్వహించే వారికి నోటీసులు ఎందుకు జారీ చేయలేదని నిల‌దీశారు. బెల్ట్ షాప్ నిర్వాహకులకు పర్మిషన్‌లు ఎలా ఇస్తారంటూ పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులను నిలదీశారు. ఆయన ప్రస్తుతం కోవిడ్-19 నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నందున ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం నుంచి మందుబాబులు తండోపతండాలుగా వ‌స్తున్నార‌ని అన్నారు. మండలంలో సుమారు 100కు పైగా వంద బెల్టుషాపులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంద‌న్నారు. ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాలకు కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన సంబంధిత అధికారులపై మండిపడ్డారు. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుని బెల్టుషాపుల‌ను మూయించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.



Next Story

Most Viewed