నాడు షేక్ హ్యాండ్స్.. నేడు ‘షాక్’ హ్యాండ్స్!

by  |
నాడు షేక్ హ్యాండ్స్.. నేడు ‘షాక్’ హ్యాండ్స్!
X

దిశ, కరీంనగర్: పాలిటిక్స్‌లో శాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం ఉండదన్న నానుడికి వీరిద్దరు పర్‌ఫెక్ట్ ఎక్సాంపుల్. ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జిల్లాలో తమ మాట వేదం అన్నట్లుగా పనిచేసిన ఆ ఇద్దరు ప్రజెంట్ బద్ద శత్రువులై పోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఆ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోతోందా అన్నట్లుగా సిచ్వేషన్ తయారైంది. ఇంతకు ఎవరా ఇద్దరు నాయకులు, ఎంటా మ్యాటర్ అనుకుంటున్నారా.. వాచ్ దిస్ స్టోరీ..

స్టూడెంట్ దశ నుండే కాంగ్రెస్‌తో అనుబంధాన్ని పెంచుకున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, తండ్రి మరణం తర్వాత అనూహ్యంగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇద్దరూ ఒకప్పడు కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేశారు. 1999లో శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏజ్ గ్రూప్ సేమ్ కావడంతో పొన్నంతో క్లోజ్‌గా మూవ్ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మరింత రిలేషన్‌షిప్ పెరగడంతో అన్నీ తామై వ్యవహరించారు. కమిటీల్లో ఎవరెవరికీ ప్రాధాన్యత ఇవ్వాలి అన్న దగ్గర్నుంచి టికెట్ల కేటాయింపు వరకు అండర్ స్టాండింగ్‌తో ముందుకు పోయారు. పొన్నం మాటే శ్రీధర్‌బాబు మాట.. శ్రీధర్ బాబు మాటే పొన్నం మాట అన్నట్టుగా రిలేషన్ షిప్‌తో జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు.

సీన్ కట్ చేస్తే.. వీరిద్దరు ఇప్పుడు ఎదురుపడ్డప్పుడు మాత్రమే మాట్లాడుకోవడం ఆ తర్వాత ఎవరి గ్రూపులు వారే మెయింటన్ చేసుకోవడం వరకు చేరింది. శ్రీధర్‌బాబు గ్రూపునకు ప్రాధాన్యత లేకుండా పొన్నం పావులు కదుపుతుంటే తన వర్గానికి ప్రాధాన్యత ఇప్పించాలని శ్రీధర్‌బాబు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత వేరే జిల్లా వ్యక్తులకు కరీంనగర్‌లో ఏం పని అన్న ప్రశ్న శ్రీధర్‌బాబు ఎదుర్కొన్నారు. చివరకు ఆయన కరీంనగర్‌కు వచ్చినా తనకు సంబంధించిన వాళ్లను రహస్యంగా కలిసి వెల్లిపోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేసులో శ్రీధర్‌బాబు పేరు వినపడుతున్న నేపథ్యంలో పొన్నం ఢిల్లీ లెవల్లో పావులు కదుపుతూ చెక్ పెట్టేస్తున్నారని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్న మాట. ఏది ఏమైనా జిల్లా కాంగ్రెస్ పాలిటిక్స్‌లో ఇమేజ్, క్రేజ్ పెంచుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు డిష్యూం డిష్యూం అనుకుంటున్నారన్నది మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.

Tags: Karimnagar, Congress, Sridhar Babu, Ponnam Prabhakar, enemies, TPCC, DCC



Next Story

Most Viewed