గుమాస్తా పనులకు హ్యుమనాయిడ్ రోబో

by  |
గుమాస్తా పనులకు హ్యుమనాయిడ్ రోబో
X

కరోనా వైరస్ కారణంగా మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎలాగూ ఆఫీసులు ప్రారంభమయ్యాయి కాబట్టి సిబ్బంది అవసరం పెరుగుతోంది. అందుకే రష్యా ప్రభుత్వం రోబోలను రంగంలోకి దింపింది. ఈ మహిళా రోబో అచ్చం క్లర్క్‌లాగా పనిచేస్తూ ప్రస్తుతానికి చిన్న చిన్న అవసరాలను తీరుస్తోంది. సైబీరియాలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఈ రోబో విధుల్లో చేరింది. బంగారు రంగు జుట్టు, గోధుమ రంగు కళ్లతో ఈ రోబో చకచకా పనులు చేసేస్తోంది. రష్యాలో న్యాయపరంగా అవసరమైన డ్రగ్ వాడకం చేయడం లేదని తెలిపే క్రిమినల్ రికార్డు ధ్రువపత్రాలను మాత్రమే ఈ రోబో ఇప్పుడు జారీ చేయగలుగుతోంది.

ప్రోమోబోట్ అనే సంస్థ ఈ రోబోను డిజైన్ చేసింది. అచ్చం రష్యన్ మహిళలాగా కనిపించేలా దీన్ని డిజైన్ చేశారు. కొన్ని వేల మంది రష్యన్ మహిళల ముఖకవళికలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషణ చేసి, దీని ముఖాన్ని డిజైన్ చేసినట్లు ప్రోమోబోట్ సంస్థ పేర్కొంది. సంబంధిత ఆఫీస్ యూనిఫాం వేసుకుని, కళ్లు, కనుబొమ్మలు, పెదవులను కదిలిస్తూ 600లకు పైగా హావభావాలను ఇది పలికించగలుగుతోంది. అంతేకాకుండా ఈ రోబో కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలగడమే కాక ప్రింటర్‌కు, స్కానర్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటుంది. దీంతో అవసరమైన సర్టిఫికెట్‌ను కూడా ప్రింట్ చేయగలుగుతుంది. ఒక సాధారణ రిజిస్ట్రీ ఉద్యోగి చేయగల పనులన్నింటినీ ఈ రోబో చేయగలుగుతోంది.


Next Story

Most Viewed