KANNAPPA: కన్నప్పకు మరో షాక్..ఆ పాత్రలు తొలగించాలని హైకోర్టులో పిటిషన్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-07 08:08:32  IST  )

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే హార్డ్ డిస్క్ మాయం అయ్యిందని చిత్రబృందం ఆందోళ‌న చెందుతుంటే ఇప్పుడు మ‌రో వివాదం మొద‌లైంది.

KANNAPPA: కన్నప్పకు మరో షాక్..ఆ పాత్రలు తొలగించాలని హైకోర్టులో పిటిషన్
X

దిశ, వెబ్ డెస్క్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే హార్డ్ డిస్క్ మాయం అయ్యిందని చిత్రబృందం ఆందోళ‌న చెందుతుంటే ఇప్పుడు మ‌రో వివాదం మొద‌లైంది. సినిమాలో బ్ర‌హ్మానందం, స‌ప్త‌గిరి న‌టించిన‌ పిల‌క, గిలక అనే పాత్ర‌ల‌ను తొల‌గించాల‌ని బ్రాహ్మ‌ణ చైత‌న్య వేధిక హైకోర్టులో పిటిష‌న్ వేసింది. ఆ పేర్లు త‌మ క‌మ్యూనిటీని అవ‌మాన‌ప‌రిచేలా ఉన్నాయ‌ని ఆరోపించింది. అయితే సినిమా సెన్సార్ ఇంకా పూర్తి అవ్వ‌లేద‌ని సెన్సార్ బోర్డ్ చెబుతోంది.

కానీ చిత్ర‌యూనిట్ గుంటూరులో ఈవెంట్ ప్లాన్ చేయ‌డంతో బ్రాహ్మ‌ణ చైత‌న్య వేదిక ఆ పాత్ర‌ల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే క‌న్న‌ప్ప సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటూ ప్రభాస్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ప్రభాస్ పాత్ర దాదాపు 30 నిమిషాలు ఉంటుందని మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రభాస్‌తో పాటూ మలయాళ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మంచు మోహన్ బాబు సైతం ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇక తాజా వివాదం నేపథ్యంలో చిత్రయూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Next Story