మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు సినీ ప్రముఖుల మద్దతు.. నెటిజన్ల ఫైర్

by  |
KTR tweet
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రతి రోజు మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ వేదికగా ఎన్నో ఫిర్యాదులు వస్తుంటాయి. అందులో కొన్నింటికి కేటీఆర్ స్పందించి సమస్యను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు సినీ ప్రముఖులు అభినందిస్తూ రీట్వీట్లు చేస్తున్నారు. అయితే ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా? రీట్వీట్లపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తు్న్నారు.

వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేయడాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు ఉద్యమంలో చనిపోయిన 750 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.3లక్షలు ఇస్తామని ప్రకటించారు. సీఎం నిర్ణయాన్ని తెలియజేస్తూ గర్వపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘ Proud of Hon’ble @TelanganaCMO KCR Garu for announcing ₹3 lakh ex gratia to all the 750 plus farmers who lost lives fighting the #FarmLaws in NCR Thumbs up He also demanded Govt of India to announce ₹25 lakh ex gratia to each farmer family & also withdraw all cases unconditionally ’’ అని ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ పదుల సంఖ్యలో సినీ ప్రముఖులు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని అభినందించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు చనిపోతే, వివిధ కారణాల వల్ల రైతులు చనిపోతే వారికి మద్దతుగా ట్వీట్లు చేశారా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలపై కూడా గొంతు విప్పాలంటూ కౌంటర్లు వేస్తున్నారు.



Next Story

Most Viewed