అన్ని మతాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తున్నాం: ఎమ్మెల్యే గణేష్ గుప్తా

by  |
అన్ని మతాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తున్నాం: ఎమ్మెల్యే గణేష్ గుప్తా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎమ్మెల్యే గణేష్ గుప్తా క్యాంపు కార్యాలయంలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం పాస్టర్ అసోసియేషన్ వారి ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని మతాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు.

బతుకమ్మ పండుగకు మన ఇంటి ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇస్తున్నారు.ముస్లిం సోదరులకు రంజాన్ తోపా, క్రైస్తవ సోదరులకు బట్టలు కానుకగా ఇచ్చి క్రిస్టమస్ వేడుకలని అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. కరోనా, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలకి అనుగూనంగా క్రిస్టమస్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు ప్రార్థనలు నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, నుడ డైరెక్టర్లు, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రమేష్, దక్షిణ మండల తహసీల్దార్ శ్రీనివాస్ ఆర్ ఐలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed