షాకింగ్‌ న్యూస్.. అంతర్జాతీయ క్రికెట్‌కు క్రిస్ గేల్ గుడ్‌బై..!

by  |
షాకింగ్‌ న్యూస్.. అంతర్జాతీయ క్రికెట్‌కు క్రిస్ గేల్ గుడ్‌బై..!
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మాన్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. ఆటకు అల్విదా ప్రకటిస్తున్నట్లు గేల్ అధికారికంగా ప్రకటించకపోయినా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌ అతని కెరీర్‌లో చివరి మ్యాచ్‌గా అర్థమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఔటైన త‌ర్వాత క్రిస్ గేల్ మైదానం నుంచి వెళ్తూ త‌న బ్యాట్‌ను స్టేడియంలోని ప్రేక్షకుల వైపు ఎత్తి చూపాడు. దీంతో అత‌ను అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై ప‌లికిన‌ట్లు తెలుస్తుంది. హెల్మెట్ తీసేసిన గేల్‌ త‌న చేతిలో ఉన్న బ్యాట్‌ను ప్రేక్షకుల వైపు చూపిస్తూ డ్రెస్సింగ్ రూమ్ దిశ‌గా వెళ్లాడు. ఫీల్డ్ నుంచి వెళ్లిన గేల్‌కు త‌న జ‌ట్టు స‌భ్యులు అభినందనలు తెలిపారు.

ఆండ్రీ రస్సెల్‌, డ్వేన్ బ్రావో యూనివర్స్ బాస్‌ను హత్తుకోవడం ఆ తర్వాత తన గ్లోవ్స్‌పై సంతకం చేసి అభిమానులకు ఇవ్వడం టీవీ కెమెరాల్లో కనిపించింది. అంతేకాకుండా కెమెరా ముందుకు వచ్చి థాంక్యూ ఫ్యాన్స్‌ అంటూ గట్టిగా అరిచాడు. తన చేష్టలతో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆటకు గుడ్ బై చెప్పినట్లు క్రిస్ గేల్ హింట్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత గేల్ రిటైర్మెంట్‌పై క్లారిటీ రానుంది. ఈ మ్యాచ్‌లో గేల్ అద్భుత‌మైన స్టార్ట్ ఇచ్చాడు. విచిత్రంగా స‌న్‌గ్లాస్‌లు పెట్టుకుని గ్రౌండ్‌లోకి దిగిన గేల్‌ రెండు భారీ సిక్సర్లతో ఆశ‌లు రేపాడు. ఇక విండీస్‌కు భారీ స్కోర్‌ను అందిస్తాడ‌నుకున్న స‌మ‌యంలో గేల్ 15 ర‌న్స్ చేసి బౌల్డయ్యాడు. ఇక క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడని అతనికి క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వ‌ర‌కు క్రిస్ గేల్ 19,593 ర‌న్స్ చేశాడు. వాటిల్లో 553 సిక్సర్లు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సంఖ్యలో సిక్సర్లు కొట్టిన ఏకైక క్రికెట‌ర్‌గా క్రిస్ గేల్ నిలిచాడు. వెస్టిండీస్ త‌ర‌పున గేల్ 75 ఇన్నింగ్స్‌లు ఆడాడు. దాంట్లో 1899 ర‌న్స్ చేశాడు. 14 హాఫ్ సెంచ‌రీలు, రెండు సెంచ‌రీలు ఉన్నాయి. అంత‌ర్జాతీయ టీ20ల్లో 123 సిక్సులు,158 ఫోర్లు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌ సిరీస్‌ల్లో రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా గేల్‌ చరిత్రలో నిలిచిపోయాడు. 2012, 2016 టీ20 ప్రపంచకప్‌లను విండీస్‌ గెలవడంలో గేల్‌ కీలకపాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గేల్‌(35 మ్యాచ్‌ల్లో 950 పరుగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

టీ20 వరల్డ్‌ కప్‌లో కీలక ఘట్టం.. ఆ జట్టు మాత్రమే గెలవాలంటూ దండాలు



Next Story

Most Viewed