ప్రాణాలు పోయినా సరే భూములు ఇవ్వం

by  |
open-cenal
X

దిశ సిద్దిపేట: మా ప్రాణాలు పోయినా సరే.. ఓపెన్ కాలువ నిర్మాణానికి భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు స్పష్టం చేశారు. సోమవారం సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని చిన్నగుండవెళ్లి గ్రామానికి చెందిన 90 మంది రైతులు ఓపెన్ కాలువకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టారు. ఈ మేరకు రైతులు ఓపెన్ కాలువ వద్దని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా మా గ్రామం నుండి పోతున్న ఓపెన్ కాలువ నిర్మాణానికి వ్యతిరేకంగా గత రెండు సంవత్సరాలుగా దీక్షలు చేస్తున్నామని, అదే విధంగా గతంలో చాలా సార్లు వద్దని మంత్రి హరీష్ రావు కు విన్నవించగా.. టన్నెల్ ద్వారా కాలువ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

కానీ మూడు రోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ బస్వరాజు ఓపెన్ కాలువ నిర్మాణానికి రైతులు సహకరిస్తున్నారని పేపర్ స్టేట్ మెంట్ ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. భూమలు కోల్పోతున్నామన్న బెంగతో ఈ రెండు సంవత్సరాలలో 18 మంది రైతులు చనిపోయారని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ కాలువ నిర్మాణానికి ఒప్పుకోమని రైతులు తెలిపారు.


Next Story

Most Viewed