పిల్లలపై అశ్లీలత, లైంగిదాడుల ఫిర్యాదులెన్నంటే..?

by  |
పిల్లలపై అశ్లీలత, లైంగిదాడుల ఫిర్యాదులెన్నంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో చిన్నారులపై అశ్లీలత, లైంగికదాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం పిల్లల అశ్లీలత, లైంగికదాడులు, సామూహిక అత్యాచారానికి సంబంధించి 13,244 ఫిర్యాదులు అందాయని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. 2020 మార్చి1 నుంచి సెప్టెంబర్ 18 వరకు జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఈ మేరకు ఫిర్యాదులు అందాయని రాజ్యసభలో మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించి 2020 మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు 420 కేసులు అందాయని స్మృతి ఇరానీ సభలో పేర్కొన్నారు. అలాగే పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించి ఈ ఏడాది మార్చి 1 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు చైల్డ్‌లైన్ ఇండియా ఫౌండేషన్ (సీఐఎఫ్‌)కు 3,941 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని ఆమె స్పష్టంచేశారు.



Next Story

Most Viewed