చెన్నమనేని పౌరసత్వంపై విచారణ వాయిదా

by  |
Vemulawada MLA Chennamaneni Ramesh
X

దిశ, వేములవాడ: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం వివాదం కేసు విచారణను హైకోర్టు వచ్చేనెలకు వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున కౌంటర్ అఫిడవిట్ ను న్యాయవాది కోర్టుకు సమర్పించారు. విచారణకు హాజరుకావాల్సిన అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రారావు ఆరోగ్యం బాగలేని కారణంగా విచారణను వాయిదా వేయాల్సిందిగా న్యాయవాది కోర్టును కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు బెంచ్ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. విచారణకు హాజరైన పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది కూడా కౌంటర్ ను దాఖలుచేశారు. హోంశాఖ కార్యదర్శి సైతం అఫిడవిట్ ను దాఖలుచేశారు. గత కొన్ని నెలలుగా చెన్నమనేని రమేష్ భారత్‎లో లేకపోవడం, పౌరసత్వంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కేసుపై సత్వరతీర్పు వెలువడుతుందని ఇరుపక్షాలూ భావించాయి. కానీ హోంశాఖ వైపు నుంచి వివరణలు, చెన్నమనేని రమేష్ నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలు లాంటి అంశాల కారణంగా తరచూ విచారణ వాయిదాపడుతోంది. కొలిక్కివస్తోంది అనుకుంటున్న తరుణంలో అదనపు అడ్వకేట్ జనరల్ హాజరుకాకపోవడంతో మరోరెండు వారాలు జాప్యం చోటుచేసుకుంది.

Next Story

Most Viewed