దుబాయ్‌లోనే కరోనా సోకిందా?

by  |
దుబాయ్‌లోనే కరోనా సోకిందా?
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ ఆడటానికి దుబాయ్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (csk) జట్టులోని ఇద్దరు క్రికెటర్లు, 11 మంది సహాయక సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని శనివారం బీసీసీఐ కూడా ధృవీకరించింది. కాగా, యూఏఈ వెళ్లడానికి ముందే చెన్నైలోని చేపాక్ స్టేడియంలో ఈ జట్టు కోసం ఐదు రోజుల పాటు ఫిట్‌నెస్ క్యాంప్ నిర్వహించారు.

ఆ సమయంలోనే వీరికి కరోనా సోకి ఉంటుందనే రూమర్లు వినిపించాయి. కానీ, అది కేవలం పుకార్లేనని సీఎస్కే జట్టు సభ్యులకు దుబాయ్‌లోనే కరోనా సోకిందని సోషల్ మీడియాలో అభిమానులు కొన్ని వీడియోలు పోస్టు చేశారు. దుబాయ్ చేరుకున్న తొలి రోజు, మూడవ రోజు, ఆరవ రోజు వీరికి టెస్టులు నిర్వహించారు. తొలి రెండు టెస్టుల్లో వారందరికీ నెగెటివ్ ఫలితం వచ్చింది. కానీ ఆరో రోజు టెస్టులో మాత్రం 13 మందికి పాజిటివ్ ఫలితం వచ్చింది.

వీళ్లు హోటల్‌కు చేరుకున్నప్పుడు అక్కడి సిబ్బందిని తాకడం, కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్లు ఇవ్వడమే కాకుండా భౌతిక దూరాన్ని అస్సలు పాటించలేదు. బీసీసీఐ (bcci) స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ నిబంధనలు అస్సలు పాటించలేదని కొన్ని వీడియోల్లో స్పష్టంగా కనపడింది. ఇదంతా ఫ్రాంచైజీ యాజమాన్యం, ఆటగాళ్ల నిర్లక్ష్యమే అని అభిమానులు అంటున్నారు. సీఎక్కే (csk) స్వయంకృతాపరాధం వల్లే కరోనా సోకినట్లు ఆ వీడియోల్లో తెలిసిపోతుంది. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Next Story

Most Viewed