ఆయన చేరికతో కరీంనగర్‌లో టీఆర్ఎస్‌కు మరింత బలం: కేకే

124

దిశ, కరీంనగర్ సిటీ: ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవం కలిగిన చల్మెడ లక్ష్మీనరసింహారావు టీఆర్ఎస్‌లో చేరడంతో.. కరీంనగర్ జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరినట్లయిందని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న లక్ష్మీనర్సింహారావు రెండు రోజుల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేసి, బుధవారం సాయంత్రం మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, కమలాకర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేకే ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న సేవలతో, చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలతోనే ఇతర పార్టీల నుంచి నాయకులు ఆకర్షితులవుతున్నారని అన్నారు.