విశ్వనాథన్ ఆనంద్‌తో చెస్ ఆడనున్న చాహల్

87

దిశ, స్పోర్ట్స్: భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌తో టీమ్ ఇండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఒక చెస్ మ్యాచ్ ఆడనున్నాను. కొవిడ్-19 రిలీఫ్ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈ మ్యాచ్ జరుగనున్నట్లు చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. కాగా, విశ్వనాథన్ ఆనంద్ ఆదివారం పలువురు ప్రముఖులతో చారిటీ మ్యాచ్‌లు ఆడనున్నాను. బాలీవుడ్ ప్రముఖులు రితేశ్ దేశ్‌ముఖ్, అమిర్ ఖాన్, అర్జిత్ సింగ్, అనన్య బిర్లా, మనుకుమార్ జైన్‌లతో ఆనంద్ పలు మ్యాచ్‌లు ఆడనున్నాను. యజువేంద్ర చాహల్ క్రికెట్‌లోకి రాకముందు జాతీయ స్థాయి చెస్ క్రీడాకారుడిగా కొనసాగాడు. ఇండియా తరపున వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో కూడా పాల్గొన్నాడు. దీంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..